28 నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు?
Sakshi Education
హైదరాబాద్: ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరేందుకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఉన్నత విద్యా మండలి ఈనెల 28 నుంచి చేపట్టే అవకాశం ఉంది. ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
కాలేజీలకు అనుమతుల ఖరారు విషయంలో కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 20 వరకు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి హైదరాబాద్ జేఎన్‌టీయూ వివరణలు స్వీకరించనుంది. ఆ తరువాత ఇంజనీరింగ్ కాలేజీల విజ్ఞప్తులు, ఫిర్యాదులు ఉంటే వాటిని జేఎన్‌టీయూహెచ్ పరిష్కరించేందుకు ఈనెల 27వ వరకు గడువు ఇచ్చింది. ఆ గడువు పూర్తికాగానే 27వ తేదీ సాయంత్రం లేదా 28న ప్రవేశాల కౌన్సెలింగ్‌లో చేర్చే కాలేజీలు, సీట్ల వివరాలను ఖరారు చేయనుంది. ఇక ఈనెల 18 నుంచి 23 వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఇప్పటికే షెడ్యూలు ఇచ్చినందున, 28 నుంచే వెబ్ ఆప్షన్లకు కూడా అవకాశం కల్పించనుంది.
Published date : 15 Jun 2015 03:36PM