Skip to main content

28, 29న ఏపీ ఎంసెట్ మూడోవిడత కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల కన్వీనర్ కోటా ప్రవేశాలకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఖరారు చేసింది.
ఈ నెల 28, 29 తేదీల్లో మూడో విడత కౌన్సెలింగ్ ఉంటుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. ఆ తేదీల్లో అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వారికి 30న సీట్ల అలాట్‌మెంట్ చేయనున్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి ఇటీవలే సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఆయా అభ్యర్థులు కాలేజీల్లో చేరేందుకు ఈనెల 23వరకు గడువు ఇచ్చారు. ఆయా కాలేజీలు ఈ నెల 25లోగా తమ సంస్థల్లో భర్తీ అయిన, మిగిలి ఉన్న సీట్ల వివరాలను కోర్సుల వారీగా ఏపీ ఎంసెట్ వెబ్‌సైట్‌కు, మండలికి అప్‌లోడ్ చేయాలి. అనంతరం మిగిలి ఉన్న సీట్లతో కన్వీనర్ కోటా మూడో విడత కౌన్సెలింగ్‌ను చేపట్టనున్నారు.
Published date : 23 Jul 2015 11:57AM

Photo Stories