26న ఎంసెట్ ర్యాంకులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ర్యాంకులను గురువారం విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు తెలిపారు.
సచివాలయంలో ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ర్యాంకులను విడుదల చేస్తారన్నారు. ర్యాంకులను విద్యార్థులు www.sakshieducation.com, www.tseamcet.in వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చు. విద్యార్థులు ఎంసెట్‌లో సాధించిన మార్కులతోపాటు ఇంటర్ మార్కులకు ఇచ్చే 25% వెయిటేజీ కలిపి తుది ర్యాంకుల వివరాలను వెల్లడిస్తారు. కాగా, ఫలితాల అనంతరం ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ప్రవేశాల కౌన్సెలింగ్‌ను జూన్ 10 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది.
Published date : 25 May 2016 02:34PM