23, 24 తేదీల్లో ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2016 ఇంజనీరింగ్ విభాగం తుది విడత కౌన్సెలింగ్ ఈనెల 23, 24 తేదీల్లో జరగనుంది.
ఈ మేరకు అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో మిగిలిన, రద్దయిన సీట్లు, అభ్యర్థులు కళాశాలల్లో సీట్లు పొందినా చేరకుండా విరమించుకున్న ఖాళీలను తుది విడతలో భర్తీ చేయనున్నారు. ఫార్మా-డి కోర్సులనూ తుది కౌన్సెలింగ్‌కు జతచేస్తున్నట్లు కన్వీనర్ వివరించారు. అలాగే, మొదటి విడతలో సీట్లు పొంది వెబ్‌ద్వారా స్వీయ రిపోర్టు, కాలేజీల్లో రిపోర్టు చేయని అభ్యర్థులు ఈనెల 20 లోపు ఆయా కాలేజీల్లో చేరకపోతే ఆ సీట్లను తుది విడతకు జతచేయనున్నట్లు స్పష్టంచేశారు. మొదటి విడతలో సీట్లు పొంది తరువాత ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు తమ సీట్లను రద్దు చేసుకోవాలని భావిస్తే సంబంధిత కాలేజీలను 20 లోగా సంప్రదించాలని సూచించారు. అలాగే, అన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, వర్సిటీల ప్రిన్సిపాళ్లు తమ సంస్థల్లో రద్దయిన, విద్యార్థులు రిపోర్టు చేయక ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను ఈనెల 21 నాటికి అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.
18 నుంచి బీఫార్మసీ కౌన్సెలింగ్
ఏపీ ఎంసెట్ రాసి అర్హులైన బైపీసీ విభాగం అభ్యర్థులు బీఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 18 నుంచి 21 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ తెలిపారు. దీనికి సంబంధించి 11న నోటిఫికేషన్ జారీకానుంది. వివరాలు https://apeamcetd.nic.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Published date : 09 Jul 2016 02:26PM