Skip to main content

13 నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను ఈనెల 13వ తేదీ నుంచి చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీలలో తొలివిడత ప్రవేశాల ప్రక్రియ ముగిసిన తదుపరి ఎంసెట్ రెండోవిడత కౌన్సెలింగ్‌ను చేపట్టాలని భావించిన ఉన్నత విద్యామండలి తాజాగా ఈ తేదీలను ఎంపికచేసినట్లు సమాచారం. ఈనెల 9, 10, 11 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని ఇంతకుముందు షెడ్యూల్‌ను ప్రకటించారు. తాజాగా షెడ్యూల్‌లో మార్పు చేసి 13, 14 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. 15వ తేదీన సీట్ల అలాట్‌మెంటు ఉంటుంది.

16నుంచి ఈసెట్ సెకండ్ కౌన్సెలింగ్: ఈసెట్ సెకండ్ కౌన్సెలింగ్‌ను ఈనెల 16నుంచి చేపట్టనున్నారు. ఈసెట్ ద్వారా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో సీట్లు పొందే విద్యార్థులు ఈనెల 20వ తేదీకి ముందే కాలేజీల్లో చేరేలా షెడ్యూల్ రూపొందించారు. 20 నుంచి తరగతులను ప్రారంభించనున్నారు.
Published date : 07 Jul 2015 01:32PM

Photo Stories