Skip to main content

12 నుంచి ఏపీ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 12 నుంచి ప్రారంభమవనుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి గురువారం నోటిఫికేషన్ జారీచేశారు.
ఆ ప్రకారం.. ఈ నెల 20వ తే దీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపడతారు. 14వతేదీ నుంచి 21వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లను మార్పుచేసుకునేందుకు 22, 23 తేదీల్లో అవకాశమిస్తున్నారు. 26న విద్యార్థులకు సీట్లను అలాట్ చేయనున్నామని వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు సంబంధించి అడ్మిషన్ల కమిటీ గురువారమిక్కడ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమై అడ్మిషన్లకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మి, ప్రైవేటు కాలేజీల యాజమాన్య ప్రతినిధి విజయభాస్కర చౌదరి(మిట్స్), జేఎన్‌టీయూ అనంతపురం, జేఎన్‌టీయూ కాకినాడ ప్రతినిధులు, ఆర్‌వీఆర్‌జేసీ(గుంటూరు), రాజీవ్‌గాంధీ(నంద్యాల), గాయత్రి(విశాఖ) కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 34 హెల్ప్‌లైన్ సెంటర్లు
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కోసం గతంలో హైదరాబాద్‌లో నోడల్ కార్యాలయం ఉండేది. ఇప్పుడు దీన్ని విజయవాడ బెంజ్‌సర్కిల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటుచేయనున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 34 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నట్లు మండ లి చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. విద్యార్థులు ర్యాంకు లు, హెల్ప్‌లైన్ సెంటర్లు, ధ్రువపత్రాల పరిశీలన తేదీలు, వెబ్ ఆప్షన్ల తేదీలు తదితర ముఖ్యమైన వివరాలకోసం apeamcet.nic.in వెబ్‌సైట్‌ను చూడాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనాంతరం వె బ్ కౌన్సెలింగ్ విధానం, ఇతరత్రా సమాచారాన్ని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో తీసుకోవాలి.

ఏయే సర్టిఫికెట్లు ఇవ్వాలి: విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనప్పుడు తమ విద్యార్హతల ధ్రువపత్రాలకు సంబంధించి రెండు సెట్ల జిరాక్సు కాపీలను అందించాలి. ఇందులో ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఇంటర్ మెమో-పాస్ సర్టిఫికెట్, ఎస్సెస్సీ లేదా తత్సమాన అర్హతలకు సంబంధించిన మార్కుల మెమో, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్ (విద్యాసంస్థల్లో చదవని అభ్యర్ధులు), 2015 జనవరి 1 తరువాత జారీఅయిన ఇన్‌కమ్ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, కులధ్రువీకరణ పత్రం జిరాక్సు కాపీలను అందించాలి. వికలాంగులు త దితర ప్రత్యేక కేటగిరీలవారు ఆయా ధ్రువపత్రాలను సమర్పించాలి.

ఫీజులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ యథాతథం
ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు అడ్మిషన్ ఫీజులను గతేడాది మాదిరిగానే అమలు చేయనున్నారు. గతంలో రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ మండలి నిర్ణయించిన మేరకు ఈ ఫీజులుంటాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి గతంలోని విధానాన్నే అమలు చేయనున్నట్టు వేణుగోపాలరెడ్డి తెలిపారు. అయితే విద్యార్థులు ఈసారి ఫీజులను కౌన్సెలింగ్ కేంద్రాలకు వెళ్లి చెల్లించనక్కర్లేకుండా నేరుగా కాలేజీల్లో అడ్మిషను పొందిన సమయంలోనే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రాసెసింగ్ ఫీజు గతంలో రూ.600 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.800కు పెంచారు. ఎస్సీ, ఎస్టీలు రూ.400 చెల్లించాలి.

జూలై 3 నుంచి తరగతులు! : ఇంజనీరింగ్ కాలేజీల్లో తరగతులను జూలై 2 లేదా మూడో తేదీనుంచి ప్రారంభించే అవకాశముంది. ఈ రెండు తేదీల్లో మంచి తిథిని చూసుకుని ఏదో ఒక తేదీని ఖరారు చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంత త్వరగా తరగతులు ప్రారంభమవనుండడం 20 ఏళ్ల తరువాత ఇదే మొదటిసారంటున్నారు. ఇదిలాఉండగా జూన్ 26తో మొదటివిడత సీట్ల అలాట్‌మెంటు పూర్తవుతుందని, 27నాటికి విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. అయితే 26నే అలాట్‌మెంట్ ఇచ్చి మరునాడే కాలేజీల్లో రిపోర్టు చేయాలంటే కష్టమవుతుందని, రెండు మూడు రోజులైనా సమయమివ్వాలని కొందరంటున్నారు. దీంతో ఆ తరువాతే రెండోవిడత కౌన్సెలింగ్ ఉండేవీలుంది.

ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులధువపత్రాల పరిశీలన ఇలా..

తేదీ

కేటగిరీ

ర్యాంకునుంచి

ర్యాంకు వరకు

12న

పీహెచ్‌వీ,

పీహెచ్‌హెచ్,

పీహెచ్‌ఓ

1నుంచి

చివరి వరకు

ఎన్‌సీసీ

1నుంచి

30,000

13న

సీఏపీ

1నుంచి

30,000

స్పోర్ట్సు, గేమ్స్

1నుంచి

45,000

14న

ఎన్‌సీసీ

30,001

65,000

సీఏపీ

30,001

చివరివరకు

15న

ఎన్‌సీసీ

65,001

90,000

స్పోర్ట్ అండ్ గేమ్స్

45,001

90,000

16న

ఎన్‌సీసీ

90,001

చివరివరకు

స్పోర్ట్ అండ్ గేమ్స్

90,001

చివరివరకు

ఆంగ్లో ఇండియన్

1నుంచి

చివరివరకు


వికలాంగులు, ఎన్‌సీసీ, మాజీ సైనికోద్యోగుల పిల్లల సర్టిఫికెట్ల పరిశీలనకు విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఆ అభ్యర్థులంతా నిర్ణీత తేదీల్లో అక్కడికెళ్లి పరిశీలన చేయించుకోవాలి.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు

తేదీ

ర్యాంకునుంచి

ర్యాంకు వరకు

12.6.2015

1

15,000

13.6.2015

15,001

30,000

14.6.2015

30,001

45,000

15.6.2015

45,001

60,000

16.6.2015

60,001

75,000

17.6.2015

75,001

90,000

18.6.2015

90,001

1,05,000

19.6.2015

1,05,001

1,20,000

20.6.2015

1,20,000

చివరి వరకు



వెబ్ ఆప్షన్ల నమోదు తేదీలు
ఈ నెల 14, 15 తేదీల్లో 1 నుంచి 30 వేల ర్యాంకు వరకు
16, 17 తేదీల్లో 30,001 నుంచి 60 వేల ర్యాంకు వరకు
18, 19 తేదీల్లో 60,001 నుంచి 90 వేల ర్యాంకు వరకు
20, 21 తేదీల్లో 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు
ఆప్షన్ల మార్చుకునే తేదీలు: ఈ నెల 22, 23
ఆన్‌లైన్లో సీట్ల అలాట్‌మెంట్: 26-6-2015

సీట్లు కోకొల్లలు
ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్రంలో 330 కాలేజీలుండగా అధికారుల వద్దనున్న సమాచారం ప్రకారం 1.65 లక్షల సీట్లున్నాయి. ఇందులో సీట్ల సంఖ్యను తగ్గించుకున్నవి, కోర్సులు రద్దుచేసుకున్నవి, కాలేజీల మూతకు దరఖాస్తు చేసుకున్నవి 94 కాలేజీలున్నాయి. ఇలా తగ్గుతున్న సీట్ల సంఖ్య 8వేల వరకు ఉండవచ్చంటున్నారు. అయితే కొత్తగా సీట్లసంఖ్యను, కోర్సులను పెంచుకున్న కాలేజీలుండడంతో మొత్తం 1.70 లక్షలనుంచి 1.80 లక్షలవరకు సీట్లు పెరగవచ్చంటున్నారు. 9వ తేదీకి రాష్ట్రంలోని మొత్తం కాలేజీలు, సీట్ల సంఖ్యపై స్పష్టత వస్తుంది.
Published date : 05 Jun 2015 12:04PM

Photo Stories