12 నుంచి ఏపీ ఎంసెట్ ర్యాంకు కార్డులు
Sakshi Education
సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ): ఏపీ ఎంసెట్-2017 ర్యాంకు కార్డులను అభ్యర్థులు ఈనెల 12 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హత సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతోందని, త్వరలోనే కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించనున్నారని వెల్లడించారు. ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు కాకుండా సీబీఎస్‌ఈ, ఏపీవోఎస్‌ఎస్‌తో పాటు ఇతర బోర్డుల నుంచి ఎంసెట్‌కు హాజరై అర్హత సాధించి, డిక్లరేషన్ ఫారాలను ఎంసెట్ కార్యాలయానికి అందచేసిన అభ్యర్థుల ర్యాంకులను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఎంసెట్‌కు దరఖాస్తు చేసే సమయంలో కొందరు అభ్యర్థులు ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం హాల్‌టికెట్ నంబర్‌కు బదులు మొదటి సంవత్సరం హాల్‌టికెట్ నంబరుతో దరఖాస్తు చేసుకున్నారని, ఈ అభ్యర్థుల డేటా ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి తెప్పించుకొని వారికి కూడా ర్యాంకులను ప్రకటిస్తామని చెప్పారు.
Published date : 12 May 2017 04:01PM