యూనివర్సిటీ పరిధికే దూరవిద్యా కేంద్రాలు పరిమితం
Sakshi Education
సాక్షి ప్రతినిధి, కర్నూలు: దూరవిద్య ఇకపై దగ్గర కానుంది. రాష్ట్రాల ఎల్లలు దాటి ఏర్పాటవుతున్న దూరవిద్యా కేంద్రాలకు ఇక కాలం చెల్లనుంది.
కేవలం ఆయా యూనివర్సిటీల పరిధిలో మాత్రమే దూరవిద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా అన్ని వర్సిటీలకూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) త్వరలో ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం. యూజీసీ అనుమతి లేకపోయినప్ప టికీ వివిధ రాష్ట్రాల్లో దూరవిద్యా కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసి విద్యార్థులను మోసం చేస్తూ డిగ్రీ, పీజీ పట్టాలను జారీ చేస్తున్నారు. దీంతో నకిలీ డిగ్రీలు భారీగా పుట్టుకొస్తున్నాయి. ఈ నకిలీ డిగ్రీలతో కొందరు ఉద్యోగాలను సంపాది స్తుండగా.. అసలైన డిగ్రీలు కలవారు మాత్రం నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.
ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు వర్సిటీలు..
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ప్రైవేటు యూని వర్సిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కొన్ని అధికారికంగా యూజీసీ నుంచి అనుమతి తీసుకొని ఏర్పాటు చేస్తుండగా.. మరికొన్ని ఎలాంటి అనుమ తులు లేకుండానే ఏర్పడుతున్నాయి. ఈ విధంగా ఏర్పడిన నకిలీ యూనివర్సిటీలు ఇతర రాష్ట్రాల్లో కూడా దూరవిద్యా కేంద్రాలను ఏర్పాటు చేసుకుని ఇష్టారీతిన డిగ్రీలను ఇచ్చేస్తూ విద్యార్థుల జీవితా లతో ఆటలాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ వర్సిటీల ఆగడాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం ప్రణాళికలు రూపొందించినట్టు తెలిసింది. కేవలం రాష్ట్రాల మధ్యనే కాకుండా రాష్ట్ర పరిధిలో కూడా దూర విద్యకు ఆంక్షలు పెట్టాలనేది కేంద్రం ఆలోచనగా ఉంది. దూరవిద్యను వర్సిటీ పరిధికే పరిమితం చేయాలని కేంద్రం భావిస్తోంది. కానీ ఏ ప్రాంతానికి చెందిన విద్యార్థులైనా వీటి ద్వారా విద్యనభ్యసించే అవకాశం కల్పించనున్నట్టు సమాచారం.

Published date : 12 May 2017 04:01PM