వెబ్‌సైట్‌లో ‘దూర విద్య’ సంస్థల వివరాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పలు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు 2016-17 విద్యా సంవత్సరం నుంచి దూర విద్య విధానంలో కోర్సులను నిర్వహించేందుకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (డెక్) అనుమతి ఇచ్చినట్లు యూజీసీ పేర్కొంది.
అయితే అన్ని విద్యా సంస్థల్లో అన్ని కోర్సులు కాకుండా కొన్నింటికే ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. ఆ కోర్సుల వివరాలను తమ వెబ్‌సైట్‌లో (www.ugc.ac.in/deb/notices.html, www.ugc.ac.in/ugc_notices.aspx)పొందుపరిచినట్లు వివరించింది. తెలంగాణలోని ఎన్‌ఐఆర్‌డీ, ఇఫ్లూ, ఇక్ఫాయ్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, నల్సార్, మౌలానా ఆజాద్ యూనివర్సిటీలకు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్రీయ సంస్కృత్ విద్యాపీఠ, పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం, ఆంధ్రా, నాగార్జున , రాయలసీమ, గీతమ్ యూనివర్సిటీలకు దూర విద్యా విధానంలో పలు కోర్సులకు అనుమతి ఇచ్చినట్లు వివరించింది.
Published date : 25 Oct 2016 01:53PM