తెలంగాణ ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్– 2021 విద్యార్థులందరూ పాస్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ విద్యార్థులను ప్రభుత్వం పాస్ చేసింది.
జూలైలో నిర్వహించాల్సిన పరీక్షలను కరోనా కారణంగా రద్దు చేసిన నేపథ్యంలో వారందరికీ కనీస పాస్ మార్కులు 35 శాతం ఇచ్చి ఉత్తీర్ణులను చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం జీవో 19 జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో 1,10,983 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అందులో పదో తరగతి విద్యార్థులు 47,591 మంది, ఇంటర్ విద్యార్థులు 63,392 మంది ఉన్నారు. 35 శాతం మార్కులతో పాస్ అయిన విద్యార్థులంతా రాష్ట్ర, జాతీయ స్థాయి, మేనేజ్మెంట్ కోటా సీట్లలో ప్రవేశాలు పొందేందుకు అర్హులేనని, డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలు యూజీసీ గుర్తింపు పొందిన ఇతర ప్రైవేట్ విద్యార్థుల ప్రవేశాలకు అర్హులుగానే పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ మార్కులతో సంతృప్తి చెందకపోతే తర్వాత ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రతి సబ్జెక్టులో 35 శాతం మార్కులను కేటాయించి ఫలితాలు ప్రకటించాలని స్పష్టం చేశారు.
టీఎస్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం 2021 ఫలితాలు విడుదల: జూలై 1 నుంచి మార్కుల మెమోలు...
డిగ్రీ ప్రవేశాలకు దోస్త్– 2021 నోటిఫికేషన్
కేజీ టు పీజీ ఆన్లైన్ బోధనే: జూలై 1 నుంచి తరగతుల ప్రారంభం..
టీఎస్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం 2021 ఫలితాలు విడుదల: జూలై 1 నుంచి మార్కుల మెమోలు...
డిగ్రీ ప్రవేశాలకు దోస్త్– 2021 నోటిఫికేషన్
కేజీ టు పీజీ ఆన్లైన్ బోధనే: జూలై 1 నుంచి తరగతుల ప్రారంభం..
Published date : 30 Jun 2021 04:26PM