సెప్టెంబర్ 5 నుంచి తత్కాల్‌లో ‘ఓపెన్’ ఫీజు చెల్లింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే దూరవిద్య ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజును తత్కాల్ కింద చెల్లించేందుకు సెప్టెంబర్ 5 నుంచి 11 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్ష ఫీజుకు అదనంగా తత్కాల్ కింద ఎస్సెస్సీకి రూ.500, ఇంటర్మీడియట్‌కు రూ.1,000 చెల్లించాలని సూచించింది.
Published date : 05 Sep 2018 02:41PM