ఫిబ్రవరి 26న ఓపెన్ డిగ్రీ ప్రవేశ పరీక్ష
Sakshi Education
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ మొదటి సంవత్సరంలో బీఎస్సీ, బీఏ, బీకాం కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షను ఫిబ్రవరి 26న నిర్వహిస్తున్నట్లు వర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు.
18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 16వ తేదీలోగా వర్సిటీ వెబ్‌సైట్‌లో ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఆన్‌లైన్ సెంటర్‌ల ద్వారా లేదా WWW.BQAOUONLINE.IN వెబ్‌సైట్‌లో రూ.300రూపాయలు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. పరీక్షకు సంబంధించిన వివరాల కోసం హైదరాబాద్ విద్యానగర్‌లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ స్టడీ సెంటర్‌లో సంప్రదించగలరు.
Published date : 16 Jan 2017 02:08PM