ఓపెన్‌స్కూల్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
Sakshi Education
సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఓపెన్‌స్కూల్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌లకు అక్టోబర్‌లో నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షల ఫీజు షెడ్యూల్‌ను విద్యా శాఖ విడుదల చేసింది.
అభ్యర్ధులు పరీక్ష రుసుమును ఈ నెల26 నుంచి సెప్టెంబర్ 4వ తేది లోపు చెల్లించాలని రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ పీ. పార్వతి ఒక ప్రకటనలో తెలిపారు. రూ.25 జరిమానాతో వచ్చే నెల 5 నుంచి 9వ తేదిలోపు, రూ.50 జరిమానాతో వచ్చే నెల10 నుంచి 14వ తేది లోపు మీ సేవ కేంద్రాలలో చెల్లించాలని చెప్పారు.
ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ అభ్యర్ధులు ఒక్కో సబ్జెక్ట్‌కు చెల్లించాల్సిన పరీక్ష రుసుము
ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ అభ్యర్ధులు ఒక్కో సబ్జెక్ట్‌కు చెల్లించాల్సిన పరీక్ష రుసుము
వివరము | ఇంటర్ | ఎస్‌ఎస్‌సీ |
థియరీ పరీక్ష ఫీజు | రూ.150 | రూ.100 |
ప్రాక్టికల్స్‌కు | రూ.100 | రూ.50 |
థియరీ అడ్డంకులకు | రూ.150 | రూ.100 |
బెటర్‌మెంట్ | రూ.250 | రూ.100 |
Published date : 25 Aug 2015 03:49PM