Skip to main content

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా టెన్‌‌త, ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరుకాగోరే అభ్యర్థులు తత్కాల్ స్కీమ్ కింద ఈనెల 11, 12, 13 వ తేదీల్లో పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నామని సొసైటీ పేర్కొంది.
ఈమేరకు ఈనెల 7న ఒక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఈ పరీక్షలు జరగనున్నాయి. తత్కాల్ ఫీజు కింద ఇంటర్మీడియెట్‌కు రూ.1,000, టెన్‌‌తకు రూ.500 ఫీజు చెల్లించాలన్నారు. ఏపీ ఆన్‌లైన్, మీసేవ, పేమెంట్ గేట్‌వే ద్వారా ఫీజులు చెల్లించవచ్చని సంస్థ పేర్కొంది.
Published date : 08 Mar 2017 01:50PM

Photo Stories