ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ సెకండరీ, సీనియర్ సెకండరీ అక్టోబర్-నవంబర్ పరీక్ష ఫలితాలు డిసెంబర్ 15న విడుదల అయ్యాయని ప్రాంతీయ సంచాలకుడు అనిల్ కుమార్ తెలిపారు.
సెకండరీ (పదో తరగతి)లో 39.25 శాతం ఉత్తీర్ణత, సీనియర్ సెకండరీ (12వ తరగతి) లో 31.75 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. అఖిల భారతస్థాయిలో సీనియర్ సెకండరీలో 1,97,261 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 1,74,352 మంది పరీక్ష రాశారని చెప్పారు. సెకండరీలో 1,24,222 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 1,18,805 మంది పరీక్ష రాసినట్లు ఆయన వెల్లడించారు.
Published date : 17 Dec 2018 01:54PM