ఓపెన్ స్కూల్ పరీక్ష ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మే 30న విడుదల చేశారు.
ఓపెన్ టెన్‌తలో మొత్తం 53,097 మంది పరీక్షలు రాయగా, 11,946 (22.5 శాతం) మంది పాసయ్యారు. ఇక, ఇంటర్ పరీక్షలకు 39,561 మంది హాజరు కాగా, 12,745 (32.21 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఒక్కో సబ్జెక్టు రీకౌంటింగ్‌కు రూ.100, రీ వెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటోకాపీ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ. 1000 చెల్లించాలని విద్యాశాఖ సూచించింది. ఈ మొత్తాన్ని జూన్ 5 నుంచి 14లోగా మీ-సేవ కేంద్రాల్లో చెల్లించాలని అధికారులు సూచించారు.
Published date : 31 May 2018 05:26PM