‘ఓపెన్’ ఫీజు చెల్లింపునకు మరో అవకాశం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్:తెలంగాణలో వచ్చే నెల 28 నుంచి ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి.
ఇప్పటికీ పరీక్ష ఫీజు చెల్లించని వారు ఈనెల 23 నుంచి 27 వరకు తత్కాల్ కింద చెల్లించవచ్చని సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వరశర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజుతోపాటు తత్కాల్ కింద పదోతరగతి విద్యార్థులు రూ.500, ఇంటర్ విద్యార్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Published date : 23 Feb 2016 12:58PM