’మనూ’లో దూరవిద్య కోర్సులకు దరఖాస్తులు
Sakshi Education
హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో దూరవిద్య ద్వారా ఎంఏ ఉర్దూ, ఇంగ్లిష్, చరిత్ర, బీఏ, బీఎస్సీ (బీజెడ్‌సీ అండ్ ఎంపీసీ), టీచ్ ఇంగ్లిష్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లలో డిప్లొమా కోర్సులు, ప్రొఫీషియన్సీ ఇన్ ఉర్దూ త్రూ ఇంగ్లిష్ సర్టిఫికేట్ కోర్సుల్లో చేరడానికి 2017- 18 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను కోరుతున్నారు.
గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారాలను పొందడానికి నేరుగా అయితే రూ.200 డీడీ, పోస్టు ద్వారా రూ.280 డీడీని చెల్లించాల్సి ఉంటుంది. బీఏలో సీటు పొందడానికి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. అందుకోసం దరఖాస్తులు పొందడానికి నేరుగా అయితే రూ.250, పోస్టు ద్వారా అయితే రూ.280 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాలను అక్టోబర్ 3లోగా అందజేయాలి. అక్టోబర్ 17 వరకు రూ.200 ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది. బీఏ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులను జూలై 15లోగా అందజేయాల్సి ఉంటుంది.
Published date : 04 Jul 2017 02:18PM