Skip to main content

‘మనూ’ దూరవిద్య పరీక్షలు వాయిదా

హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో దూరవిద్య పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు గురువారం వెల్లడించారు.
కోవిడ్ వైరస్ నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జమ్మూ, శ్రీనగర్ రీజియన్ ప్రాంతాల్లో దూరవిద్య పరీక్షలను, 19వ తేదీ నుంచి నిర్వహించాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. శ్రీనగర్, జమ్మూల్లోని జిల్లా మెజిస్ట్రేట్/చైర్మన్, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశాల మేరకు ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వివరించారు.
Published date : 20 Mar 2020 03:26PM

Photo Stories