‘మనూ’ దూరవిద్య బీఈడీకి దరఖాస్తులు
Sakshi Education
హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో దూరవిద్యా (డిస్టెన్స్ ఎడ్యుకేషన్) ద్వారా బీఈడీ కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఇన్‌సర్వీస్ టీచర్లు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు పాసైన విద్యార్థులు బీఈడీ కోర్సులో చేరేందుకు అర్హులు. ప్రాస్పెక్టస్, దరఖాస్తులను వర్శిటీ వెబ్‌సైట్ www.manuu.ac.in నుంచి పొందవచ్చు. మే 6లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. యూనివర్శిటీ ద్వారా దేశంలోని 23 కేంద్రాల్లో బీఈడీ కోర్సును నిర్వహిస్తున్నారు.
Published date : 13 Apr 2016 01:47PM