మార్చి 5న ‘మనూ’ డిస్టెన్స్ బీఈడీ ప్రవేశ పరీక్ష
Sakshi Education
హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ)లోని డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దూరవిద్య బీఈడీ కోర్సు ప్రవేశ పరీక్షని మార్చి 5న నిర్వహించనున్నట్లు డీడీఈ డెరైక్టర్ ప్రొఫెసర్ కేఆర్ ఎక్బాల్ అహ్మద్ ప్రకటించారు.
సాంకేతిక కారణాల రీత్యా ఈ నెల 26న నిర్వహించాల్సిన పరీక్షను మార్చి 5కి మార్చినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌లోని ప్రధాన క్యాంపస్‌తోపాటు పుణే, కోల్‌కతా, ఢిల్లీ, జమ్మూ, శ్రీనగర్, భోపాల్, పట్నా, బెంగళూరుల్లో ప్రవేశ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
Published date : 15 Feb 2017 03:09PM