కరుగుతున్న అమెరికా కలలు..
Sakshi Education
వాషింగ్టన్: ఉద్యోగ విధానంతో పాటు హెచ్1బీ వీసా నిబంధనల్ని కఠినతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అగ్రరాజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ఓ నివేదికలో తేలింది.
ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు చర్యలు అక్కడి కంపెనీలు, విశ్వవిద్యాలయాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్‌ఎఫ్‌ఏపీ) ఓ నివేదికను విడుదల చేసింది. అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు విదేశీ విద్యార్థుల రూపంలో గణనీయంగా ఆదాయం అందుతున్న నేపథ్యంలో ట్రంప్ తాజా చర్యలతో ఈ ఆదాయం తగ్గుతోందని తేల్చింది. అమెరికా వర్సిటీల్లో సైన్‌స, ఇంజనీరింగ్ డిగ్రీలు పొందిన విదేశీయులే ప్రస్తుతం అక్కడి సంస్థలకు ప్రధాన మానవవనరుగా ఉన్నారు.
21 శాతం తగ్గిన భారత విద్యార్థులు...
అమెరికాలో కంప్యూటర్‌సైన్‌స, ఇతర ఇంజనీరింగ్ కోర్సుల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లే భారతీయుల సంఖ్య 2016తో పోల్చితే 2017 నాటికి దాదాపు 21 శాతం (18,590 విద్యార్థులు) మేర తగ్గిందని నివేదికలో తెలిపింది. అమెరికా వర్సిటీల్లో చేరే మిగతా దేశాల విద్యార్థుల సంఖ్య 6 శాతం(14,730) తగ్గిందంది. హెచ్1బీ వీసాల జారీ విధానంలో ట్రంప్ యంత్రాంగం చేపట్టనున్న మార్పుల కారణంగానే అమెరికాకు వచ్చేందుకు విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు విముఖత చూపుతున్నట్లు వెల్లడించింది.
అక్కడ విదేశీ విద్యార్థులదే సింహభాగం...
అమెరికా విశ్వవిద్యాలయాల్లో వేర్వేరు కోర్సుల్లో చేరేవారిలో విదేశీ విద్యార్థులే అధికంగా ఉన్నట్లు ఎన్‌ఎఫ్‌ఏపీ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం అమెరికా వర్సిటీల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 93 శాతం, కంప్యూటర్ సైన్‌సలో 88 శాతం విద్యార్థులు విదేశీయులే. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ), సైన్‌స-ఇంజనీరింగ్-గణితం(స్టెమ్) ఓపీటీలను పరిమితం చేయడమో, లేకపోతే తొలగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఓపీటీ విధానంలో విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో చదువుకునేందుకు, శిక్షణ పొందేందుకు, పనిచేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది.

Published date : 27 Feb 2018 04:22PM