Skip to main content

కేయూ దూరవిద్య అర్హత పరీక్షకు నోటిఫికేషన్

కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్ కోర్సుల్లో 2019-20 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం అర్హత పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది.
ఏప్రిల్ 29 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని వరంగల్ అర్బన్ జిల్లాలోని కేయూ ఎస్‌డీఎల్‌సీఈ డెరైక్టర్ జి.వీరన్న తెలిపారు. ఈ ఏడాది మే 31వ తేదీ వరకు 18 సంవత్సరాల వయస్సు నిండినవారు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో 162 అధ్యయన కేంద్రాలున్నాయని, రూ 400 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఎస్‌బీఐ/ఆంధ్రాబ్యాంకు లేదా ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ రూపంలో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
Published date : 27 Apr 2019 03:19PM

Photo Stories