కేయూ దూర విద్య నోటిఫికేషన్ విడుదల
Sakshi Education
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూర విద్యా (ఎస్‌డీఎల్‌సీఈ) ద్వారా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబర్ 26న దూర విద్యా కేంద్రం డెరైక్టర్ ప్రొ.సీహెచ్.దినేశ్‌కుమార్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
తెలంగాణలో దూరవిద్యా కేంద్రం పరిధిలో 153 అధ్యయన కేంద్రాలున్నాయని.. వీటిలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు. 2017-2018 విద్యా సంవత్సరంలో డిగ్రీ, పీజీ , డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు మొత్తం కలిపి 25 ఉన్నాయని, వీటికి నోటిఫికేషన్ జారీచేసినట్లు వెల్లడించారు. అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ ఫీజు డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ కోర్సులకు రూ.200, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు రూ.250 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎంఏ కోర్సులతోపాటు ఎమ్మెస్సీ బాటనీ, ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, పీజీ డిప్లొమా ఇన్ గెడైన్‌స అండ్ కౌన్సిలింగ్ కోర్సులకు రూ.500తో పాటు ఆయా కోర్సులకు ఫీజుల ను చెల్లించి సంబంధిత సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టస్‌లను www.sdlceku.co.in నుంచి నేరుగా డౌన్‌లోడు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జారీ చేసిన కోర్సులన్నింటికీ న్యూఢిల్లీలోని డిస్టెన్‌స ఎడ్యుకేషన్ బ్యూరో (డెబ్) అనుమతి ఉందన్నారు.
Published date : 27 Oct 2017 01:56PM