Skip to main content

జూన్ 3 నుంచి తెలుగు వర్సిటీ దూర విద్య తరగతులు

హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం
2015-16 విద్యా సంవత్సరంలో ప్రవేశం పొందిన ఎం.ఎ. తెలుగు, సంస్కృతం, టూరిజం మేనేజ్‌మెంట్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, జ్యోతిషం, ఎం.సి.జె., బి.ఎ.స్పెషల్ తెలుగు, బి.ఎ. కర్ణాటక సంగీతం మొదటి సంవత్సరం విద్యార్థులకు, పి.జి. డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, సినిమా రచన డిప్లొమా కోర్సు విద్యార్థులకు వచ్చే నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కాంటాక్టు తరగతులు హైదరాబాదులోని వర్సిటీ ప్రధాన ప్రాంగణంలో నిర్వహిస్తామని రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే సంగీత విశారద, లలిత సంగీతం, మొదటి సంవత్సరం విద్యార్థులకు, ఒక సంవత్సరం కాల పరిమితి గల జ్యోతిష్యం సర్టిఫికెట్, జ్యోతిషం డిప్లొమా, పి.జి.డిప్లొమా ఇన్ టెలివిజన్ జర్నలిజం కోర్సులకు వచ్చే నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కాంటాక్టు క్లాసులు నిర్వహిస్తామన్నారు.

వార్షిక పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు జూన్ 10:
2016 అక్టోబరు 14 నుంచి నవంబరు 3 వరకు జరిగే వార్షిక పరీక్షల ఫీజును జూన్ 10వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. ఆలస్య రుసుం రూ.300తో జూలై 10వ తేదీ వరకు రూ.600 ఆలస్య రుసుంతో జూలై 31వ తేదీ వరకు గడువు ఉన్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య తెలిపారు.
Published date : 30 May 2016 02:57PM

Photo Stories