‘ఇగ్నో’ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
సాక్షి, విశాఖపట్నం: ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో)లో 2019 ఏడాదికి డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు విశాఖ ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్ ఎస్.రాజారావు జనవరి 8న ఒక ప్రకటనలో తెలిపారు.
జనవరి 15వ తేదీ లోపు దరఖాస్తు చేయాలని కోరారు. విశాఖ ప్రాంతీయ కేంద్రం పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు యానాంలో నివసించే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. డిగ్రీ పాసైనవారికి మేనేజ్‌మెంట్ డిప్లొమాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మరిన్ని వివరాల కోసం https://www.ignou.ac.in వెబ్‌సైట్‌లో చూడాలని తెలిపారు. విశాఖలో ఇగ్నో ప్రాంతీయ కేంద్రం, ఉషోదయ జంక్షన్ (ఎంవీపీ కాలనీ), డాక్టర్ ఎల్ బుల్లయ్య కాలేజ్ (0891-2746293), ఐడియల్ కాలేజ్ (0884-2358515), రాజమండ్రి ప్రభుత్వ ఆర్‌ట్స కళాశాల (0883-2433002), అమలాపురం ఎస్‌కేబీఆర్ కాలేజ్ (9849373773), గాజువాకలో ఎంవీఆర్ కాలేజ్ (0891-2512891), విజయనగరం ఎంఆర్ పీజీ కాలేజ్ (9440999986), రాజాంలో ఎస్‌జీసీఎస్‌ఆర్ కాలేజ్ (9491816025), భీమవరంలో డీఎన్‌ఆర్ కాలేజ్ (9866624444) కేంద్రాలను సంప్రదించవచ్చన్నారు. rcvisakhapatnam@ifnou.ac.in మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
Published date : 09 Jan 2019 01:40PM