ఇగ్నో నుంచి యూజీ, పీజీ కోర్సులు
Sakshi Education
హైదరాబాద్: వచ్చే జనవరి నుంచి ప్రారంభం కానున్న యూజీ, పీజీ, డిప్లమో, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికై ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఆసక్తి కల అభ్యర్థులు డిసెంబరు 1లోగా దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్ అశోక్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు www.ignou.ac.in వెబ్‌సైట్‌లో లేదా 040-23117550 నెంబరులో ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.
Published date : 08 Nov 2014 12:42PM