ఎస్వీయూ దూరవిద్య కోర్సులకు అడ్మిషన్లు
Sakshi Education
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య విభాగం నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అడ్మిషన్ షెడ్యూల్, ఇన్ఫర్మేషన్ బ్రోచర్లను వీసీ ప్రొఫెసర్ కె.రాజారెడ్డి గురువారం తన చాంబర్‌లో విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ ఎస్వీయూ దూరవిద్య విభాగం పరిధిలో 19 పీజీ, 5 యూజీ, 2 డిప్లొమో కోర్సులను అందిస్తున్నామన్నారు. అభ్యర్థులు ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసి, ఫిబ్రవరి 26లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు. అలాగే ఎలాంటి విద్యార్హత లేని వారు కూడా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలో అడ్మిషన్ పొందవచ్చన్నారు. పూర్తి సమాచారం కోసం https://www.svudde.in/ వెబ్‌సైట్‌లోనూ సందేహాల నివృత్తికి 970 5105270, 9177220642 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు.
Published date : 22 Jan 2021 02:58PM