ఏప్రిల్ 29 నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు
Sakshi Education
హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఏ, బీకాం, బీఎస్సీ విద్యార్థులకు ఏప్రిల్ 29 నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు వర్సిటీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
డిగ్రీ 3వ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మే 6 నుంచి 11 వరకు, మొదటి సంవత్సరం వారికి మే 13 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాయి. విద్యార్థులు వర్సిటీ వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజును టీఎస్, ఏపీ ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా చెల్లించాలని సూచించాయి. ఈ నెల 29 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ అని చెప్పాయి.
Published date : 07 Mar 2020 03:31PM