ఏప్రిల్ 27 నుంచి దూరవిద్య డీఎడ్ పరీక్షలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సు మొదటి సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి.
పరీక్షలు మూడ్రోజులు జరుగుతాయని ఎన్‌ఐఓఎస్ రీజనల్ డెరైక్టర్ అనిల్‌కుమార్ తెలి పారు. ఫీజు చెల్లించినా స్టడీ సెంటర్లు కేటాయించని వారు, 75 శాతం హాజరు లేని, పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రాంకు హాజరు కాని వారు జిల్లా విద్యాశాఖ అధికారు లను సంప్రదించి వారికి కేటాయించిన స్టడీ సెంటర్లలో రిపోర్టు చేయాలని సూచించారు.
Published date : 30 Mar 2018 03:14PM