ఏప్రిల్ 20 నుంచి దూర విద్య టెన్త్, ఇంటర్ పరీక్షలు
Sakshi Education
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్‌ఎస్) ఆధ్వర్యంలో దూర విద్య పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 30 వరకు జరగనున్నాయని సంస్థ రాష్ట్ర డెరైక్టర్ ఆర్.నరసింహారావు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,500 దూర విద్య కేంద్రాల నుంచి పదో తరగతి పరీక్షలకు 56,303 మంది, ఇంటర్ పరీక్షలకు 58,765 మంది హాజరు కానున్నట్లు చెప్పారు. అన్ని దూర విద్య కేంద్రాల్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని, వెబ్‌సైట్ నుంచి పొందిన హాల్ టికెట్లలోని వివరాల్లో తప్పులు దొర్లడం, వాటిని సరిచేసి తిరిగి అభ్యర్థులకు పంపడంలో జాప్యం జరుగుతున్న దృష్ట్యా ఈ మార్పులు చేసినట్లు వివరించారు. ఏ సమస్యలున్నా గుంటూరులోని ఏపీఓఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలోని 0863-2239151 హెల్ప్‌లైన్ నంబర్‌ని సంప్రదించాలని సూచించారు.
Published date : 11 Apr 2018 03:07PM