ఏప్రిల్ 11న ఇగ్నో ప్రవేశ– 2021 పరీక్షలు
Sakshi Education
నాంపల్లి (హైదరాబా ద్): ఇందిరాగాంధీ జాతీ య సార్వత్రిక విశ్వవిద్యా లయం (ఇగ్నో) ఎంబీ ఏ, బీఎస్సీ నర్సింగ్, బీఎడ్ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 11న నిర్వహించనుంది.
దేశవ్యాప్తంగా 120 కేంద్రాల్లో 40,170 మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షలకు హాజరుకానున్నారు. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం నుంచి 462 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని ప్రాంతీయ కేంద్రం సంచాలకులు ఎస్.ఫయాజ్ అహ్మద్ ఓ ప్రకటనలో పే ర్కొన్నారు. వీరంతా నిజాం కళాశాలలో పరీక్ష రాయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. కంట్రోల్ నంబరు లేదా మొబైల్ నంబరు, పుట్టిన తేదీని ఉపయోగించి ఇగ్నో వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయం కంటే 45 నిమిషాలు ముందుగానే చేరుకోవాలని చెప్పారు. ఇతర వివరాల కోసం 9492451812, 040–23117550 ఫోన్ నంబరులో సంప్రదించాలని సూచించారు.
Published date : 09 Apr 2021 02:50PM