ఏపీ ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
Sakshi Education
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జూన్ 8న విశాఖలోని తన నివాసంలో విడుదల చేశారు.
ఓపెన్ స్కూల్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 30వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. నెల వ్యవధిలోనే ఈ సారి ఫలితాలను విడుదల చేయడం విశేషం. ఓపెన్ స్కూల్ పరీక్షల్లో భాగంగా ఈ ఏడాది ఎస్‌ఎస్‌సీలో 51,917 మంది పరీక్షకు హాజరుకాగా 34,448 మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇంటర్‌లో 55,475 మంది పరీక్షకు హాజరుకాగా 37,217 మంది ఉత్తీర్ణత సాధించారని ఆయన వెల్లడించారు. ఎస్‌ఎస్‌సీలో 66.35 శాతం, ఇంటర్‌లో 67.09 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో ప్రకాశం జిల్లా ప్రథమస్థానంలో నిలవగా, కడప జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. ఇంటర్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా తొలిస్థానంలోనూ, గుంటూరు జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. జూన్ 11లోపు ఎస్‌ఎస్‌సీ విద్యార్థులు సబ్జెక్టుకు రూ.100, ఇంటర్ విద్యార్థులు సబ్జెక్టుకు రూ.200 ఫీజు చెల్లించి రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఓపెన్ ఎస్‌ఎస్‌సీ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఓపెన్ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఓపెన్ ఎస్‌ఎస్‌సీ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఓపెన్ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published date : 09 Jun 2018 02:13PM