ఏఎన్‌యూ దూరవిద్య ఫలితాలు విడుదల
Sakshi Education
గుంటూరు (ఏఎన్‌యూ): ఏపీ, తెలంగాణలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం మే నెలలో నిర్వహించిన బీబీఎం, బీహెచ్‌ఎం, బీబీఏ కోర్సుల ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేశామని దూరవిద్య పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ బి.సత్యవతి తెలిపారు.
ఈ ఫలితాలను www.anucde.info, www.anucde.com వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చని చెప్పారు. ఈ నెల 24వ తేదీలోపు రీవాల్యుయేషన్ ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Published date : 09 Aug 2016 01:56PM