ఏఎన్‌యూ దూరవిద్య ఫలితాలు విడుదల
Sakshi Education
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున దూరవిద్యా కేంద్రం ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంటెక్ కోర్సుల పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేశామని దూరవిద్య పరీక్షల డిప్యూటీ రిజిస్ట్రార్ సి.రమేష్‌బాబు తెలిపారు.
ఫలితాలు, రీవాల్యుయేషన్ వివరాలు www.anucde.info, www.anucde.com వెబ్‌సైట్‌ల ద్వారా పొందవచ్చని సూచించారు. అలాగే ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆర్‌సెట్(రీసెర్చి కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలను సోమవారం వర్సిటీ ఇన్‌చార్జి వీసీ బి.ఉదయలక్ష్మి విడుదల చేశారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను www.anudoa.in వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చన్నారు. ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు జరిగే తేదీలు సంబంధిత విభాగాధిపతులు నిర్ణయిస్తారని తెలిపారు.
Published date : 25 Aug 2015 04:05PM