Skip to main content

ఏఎన్‌యూ దూరవిద్య పరీక్షలు వాయిదా

ఏఎన్‌యూ(గుంటూరు): ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో డిసెంబర్ 17,18వ తేదీల్లో జరగాల్సిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య పరీక్షలను వాయిదా వేశామని ఏఎన్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య జి రోశయ్య డిసెంబర్16న ఒక ప్రకటనలో తెలిపారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం డిసెంబర్ 17వ తేదీ నుంచి ఏఎన్‌యూ దూరవిద్య డిగ్రీ, పీజీ తదితర కోర్సుల పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా పెథాయ్ తుఫాను తీవ్రత దృష్ట్యా పరీక్షలు వాయిదా వేశామన్నారు. వాయిదా పడిన పరీక్షలు మరలా ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో ప్రకటిస్తామన్నారు.
Published date : 17 Dec 2018 01:59PM

Photo Stories