ఏఎన్‌యూ దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల
Sakshi Education
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యాకేంద్రం ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన ఎంఏ జర్నలిజం, ఎంహెచ్‌ఆర్‌ఎం, పీజీడీహెచ్‌హెచ్‌ఎం, పీజీడీబీఎం, పీజీడీబీఎఫ్‌ఎం, పీజీడీహెచ్‌ఆర్‌ఎం, పీజీడీబీ, పీజీడీఐఎం, పీజీడీఎంఎం, పీజీడీటీటీఎం, పీజీడీఎఫ్‌ఎం కోర్సుల పరీక్ష ఫలితాలను ఆగస్టు 1న విడుదల చేసినట్టు ఆ పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ భవనం ఆంజనేయరెడ్డి తెలిపారు.
ఈ ఫలితాలను www.anu.ac.in వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. ఎంఏ జర్నలిజం, ఎంహెచ్‌ఆర్‌ఎం కోర్సులకు రీవాల్యుయేషన్‌కు ఆగస్టు 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఒక్కో పేపర్‌కు ఫీజు రూ.960 రూపాయల చొప్పున చెల్లించాలన్నారు.
Published date : 02 Aug 2017 02:01PM