దూరవిద్య రీవ్యాల్యుయేషన్ ఫలితాలు విడుదల
Sakshi Education
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున వర్సిటీ దూర విద్యా కేంద్రం గతేడాది డిసెంబర్‌లో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఎంఏ తెలుగు, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, హిస్టరీ, ఎమ్మెస్సీ గణితం, స్టాటిస్టిక్స్, మైక్రోబయాలజీ, ఎమ్మెస్సీ ఐటీ, కెమిస్ట్రీ, కోర్సుల పరీక్షల జవాబుపత్రాల రీవాల్యుయేషన్ ఫలితాలను ఈనెల 20న విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ ఆంజనేయరెడ్డి తెలిపారు. ఫలితాలను www.anucde.info వెబ్‌సైట్‌లో ఉంచారు.
బీటెక్ పరీక్షా ఫలితాలు విడుదల: డిసెంబర్‌లో తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన బీటెక్ కోర్సు అన్ని సంవత్సరాల పరీక్షా ఫలితాలను ఈనెల 20న విడుదల చేశారు. ఫలితాలను www.anucde.info వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు.

Published date : 21 Mar 2017 03:04PM