Skip to main content

దూరవిద్య పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

ఏఎన్‌యూ (గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది మేలో నిర్వహించనున్న అకడమిక్ ఇయర్ బ్యాచ్ పరీక్షల ఫీజు షెడ్యూల్‌నుఈనెల 27నవిడుదల చేసింది.
డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సుల పరీక్షలు మే 21 నుంచి ప్రారంభమవుతాయని దూరవిద్య పరీక్షల కోఆర్డినేటర్ డాక్టర్ కె.వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ 12 తుది గడువుగా నిర్ణయించారు. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 20 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు, పరీక్షల టైంటేబుల్ తదితర వివరాలను www.anucde.info, www.anu.ac.in వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని సూచించారు. విద్యార్థులు సంబంధిత అస్సైన్‌మెంట్లను ఏప్రిల్ 30 లోగా ఏఎన్‌యూ దూరవిద్యాకేంద్ర వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలని పేర్కొన్నారు.
Published date : 28 Mar 2017 01:46PM

Photo Stories