దూరవిద్య ద్వారా వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సులు
Sakshi Education
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దూరవిద్య ద్వారా సేంద్రీయ వ్యవసాయం, మిద్దెతోటల పెంపకం అంశాల్లో సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వల్లభనేని దామోదర్‌నాయుడు తెలిపారు.
కోర్సు తరగతులు ప్రతి జిల్లాలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల్లో జూన్ 10 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరుగుతాయని తెలిపారు. దూర దరఖాస్తులు మే 1 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
Published date : 14 Apr 2018 05:51PM