దూరవిద్య దరఖాస్తుకు గడువు పెంపు
Sakshi Education
హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు.
2018-19 విద్యాసంవత్సరానికి గాను ఇందులో ఎంఏ ఉర్దూ, ఇంగ్లిష్, చరిత్ర, హిందీ, అరబిక్, ఇస్లామిక్ స్టడీస్, బీఏ, బీకామ్, బీఎస్సీ (లైఫ్‌సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్)లతో పాటు ఏడాది డిప్లొమా, ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సులూ ఉన్నాయి. పూర్తి వివరాల కోసం 040-23008463, 23006612/13/14/15, 6301910770 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
Published date : 29 Sep 2018 02:34PM