దూరవిద్య డిగ్రీ ప్రవేశాల గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు
Sakshi Education
గుంటూరు ఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో దూరవిద్య బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు తుది గడువును నవంబర్ 30 వరకు పొడిగించినట్టు వర్సిటీ స్టడీ సెంటర్ ప్రాంతీయ సమన్వయకర్త పి.గోపీచంద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
యూజీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల ట్యూషన్ ఫీజు చెల్లించడంతో పాటు ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఉందన్నారు. ఇతర వివరాలకు 0863-2227950, 7382929605 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Published date : 27 Nov 2020 01:46PM