దూర విద్యకు టెక్నాలజీ టచ్!
Sakshi Education
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దూర విద్యా కేంద్రంలో విద్యా బోధన ఎలా ఉంటుందో తెలుసా? అడ్మిషన్ తీసుకోగానే ఆ విద్యా సంవత్సరానికి అవసరమయ్యే పుస్తకాలు అక్కడికక్కడే విద్యార్థుల చేతికిచ్చేస్తారు.
అంతే..! విద్యార్థే సొంతంగా చదువుకోవాలి. రోజూ వారీ క్లాసులుండవు.. సందేహాలొస్తే నివృత్తి చేసే వారూ ఉండరు. అందుకే అకడమిక్‌తో పోల్చితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో విద్యార్థుల సంఖ్యే కాదు.. ఉత్తీర్ణత శాతమూ తక్కువే ఉంటుంది. మరి టెక్నాలజీతో పోటీపడే ఈ ప్రపంచంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వర్శిటీల విద్యార్థుల పరిస్థితేంటి? ఈ ప్రశ్నకు సమాధానమే ‘స్కూల్‌గురు’. పేరులోనే దూర విద్యా కేంద్రం.. చదువులు, టెక్నాలజీ విషయంలో ఏమాత్రం కాదని నిరూపిస్తున్నారు స్కూల్‌గురు కో-ఫౌండర్ శాంతనురూజ్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మన దేశంలోని విద్యా వ్యవస్థలో టెక్నాలజీ వాడకం చాలా తక్కువగా ఉందని! దూర విద్యా వ్యవస్థలో అయితే మరీను!! విద్యకు కాస్త టెక్నాలజీని జోడి స్తే అద్భుతాలు సృష్టించవచ్చు. అలా 2012 డిసెంబర్‌లో ముంబై కేంద్రంగా స్కూల్‌గురు సంస్థ ప్రారంభమైంది.
ఎలా పనిచేస్తుందంటే..:
ఆయా యూనివర్శిటీల్లో అడ్మిషన్ తీసుకోగానే విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాలతో పాటుగా స్కూల్‌గురు రూపొందించిన ఓ పెన్‌డ్రైవ్‌ను కూడా ఇస్తారు. దీన్ని సెల్‌ఫోన్‌లో గానీ, డెస్క్‌టాప్‌లో గాని ఇన్‌సెర్ట్ చేయగానే ఆప్ డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇందులో నుంచి పాఠ్యాంశాలను, ప్రొఫెసర్ల క్లాసులను వీడియోతో సహా చూడొచ్చు. సందేహాలొస్తే నేరుగా ప్రొఫెసర్లతో లైవ్ చాట్ చేయవచ్చు. ఆయా వర్శిటీలకు సంబంధించిన ఫీజులను నేరుగా ఆన్ లైన్ ద్వారా చెల్లించొచ్చు. వర్శిటీ పరీక్షల తేదీలు, ఫలితాలు, వర్శిటీ కార్యక్రమాల వంటివన్నీ నేరుగా సెల్‌ఫోన్ నుంచే చేసుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఇంటర్నెట్ లేకుండానే పనిచేస్తుంది. దీంతో మనం ఎక్కడికెళ్లినా ఆప్ ద్వారా చదువుకునే వీలుంటుంది. ఇందుకోసం విద్యార్థుల ఎలాంటి చార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. వర్శిటీలు వసూలు చేసే ఆయా ఫీజుల్లో 25 శాతం సొమ్మును స్కూల్‌గురుకు చెల్లించాల్సి ఉంటుంది.

Published date : 05 Dec 2015 02:42PM