బీఆర్ అంబేడ్కర్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు
Sakshi Education
హైదరాబాద్: డా.బీఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2017- 18 విద్యా సంవత్సరానికి గాను పలు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ అకడమిక్ కౌన్సిలర్స్ వెల్‌ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దునుకు వేలాద్రి, గౌరవ అధ్యక్షుడు డా.పర్వతం వెంకటేశ్వర్లు జూలై 13న ఓ ప్రకటనలో తెలిపారు.
2017 జూలై 1కి 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. విద్యార్హతతో సంబంధం లేకుండా తెలంగాణ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అపరాధ రుసుము లేకుండా ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 23 నుంచి ఆగస్టు 5 వరకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 6న ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు. బీఈడీ ఎంట్రెన్‌స కూడా ఆగస్టు 6నే జరుగుతుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం www.braou.ac.inవెబ్‌సైట్, 9959850497, 9177566741లను సంప్రదించవచ్చు. ఆయా ప్రాంతాల్లో ఉన్న యూనివర్సిటీ రీజినల్ స్టడీ సెంటర్‌లలో కూడా సంప్రదించవచ్చు.
Published date : 14 Jul 2017 12:28PM