ఆన్‌లైన్‌లో ఏయూ దూరవిద్య సేవలు
Sakshi Education
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం తన సేవలను విసృ్తతం చేసింది.
ఆన్‌లైన్‌లో దూరవిద్య ప్రవేశాల కల్పన విధానాన్ని వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అక్టోబర్ 19న ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ టీసీఎస్ అయాన్, ఎస్‌బీఐ సహకారంతో ఏయూ ఈ నూతన ప్రక్రియను ప్రారంభించిందని చెప్పారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో నేరుగా దూరవిద్యలో ప్రవేశం పొందే అవకాశం కల్పిస్తున్నామన్నారు. పరీక్ష ఫీజులను ఇకపై ఆన్‌లైన్లో చెల్లించే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. పరీక్షల సమాచారాన్ని విద్యార్థుల ఈమెయిల్, ఫోన్ నంబరుకు తెలియజేస్తామన్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి టీసీఎస్ సంస్థ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నెంబరును, ఈ మెయిల్‌ను ఏర్పాటు చేసిందన్నారు.
Published date : 20 Oct 2018 01:09PM