Skip to main content

ఆంధ్ర ప్రదేశ్‌లో ‘ఓపెన్’ పరీక్ష ఫీజు 5లోపు చెల్లించొచ్చు

సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 4న జరిగే ఓపెన్ స్కూల్ ఇంటర్, ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తత్కాల్ స్కీము కింద ఈనెల 5లోపు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ(ఏపీఓఎస్‌ఎస్) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ స్కీమ్ కింద ఇంటర్‌కు రూ.1000లు, ఎస్‌ఎస్‌సీకి రూ.500లను సాధారణ ఫీజుకు అదనంగా చెల్లించాలి. మరింత సమాచారంకోసం స్టడీ సర్కిల్ సెంటర్‌లోని ఏ1- కోఆర్డినేటర్లను సంప్రదించాల్సిందిగా ఏపీఓఎస్‌ఎస్ కోరింది.
Published date : 04 Mar 2016 01:14PM

Photo Stories