Skip to main content

అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాలకు దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఎలాంటి విద్యార్హత లేకున్నా అర్హులే. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షను ఆగస్టు 7 ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ, ఏపీల్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ సెంటర్లను సంప్రదించాలి. మరిన్ని వివరాలకు 9959850497 నంబర్‌ను సంప్రదించాలి.
Published date : 20 Jul 2016 03:03PM

Photo Stories