Skip to main content

అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ ప్రవేశాలకు గడువు ఆగస్టు 19

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీలో ప్రవేశం పొందేందుకు ఆగస్టు 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. 2014-15 విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు ఇంటర్, పాలిటెక్నిక్, తత్సమాన కోర్సులు చదివి ఉండాలి. లేదా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత సాదించాలి. ఈ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. అలాగే డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసి రెండో సంవత్సరం, మూడో సంవత్సరంలో చేరేవారు ఆగస్టు 19 కల్లా ట్యూషన్ ఫీజు చెల్లించాలని ఆ ప్రకటనలో తెలిపారు.
Published date : 18 Jul 2014 11:38AM

Photo Stories