Skip to main content

అంబేద్కర్ వర్శిటీ డిగ్రీ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఆగస్టు 17

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీలో ప్రవేశం కోసం మరోమారు ప్రవేశ పరీక్ష నిర్వహించాలని తలపెట్టారు.
ఆగస్టు 23న అన్ని జిల్లాల్లోని పరీక్షాకేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుందని వర్సిటీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 17వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియంలో నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తులను వర్సిటీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని సూచించారు.
Published date : 18 Jul 2015 01:07PM

Photo Stories