అంబేడ్కర్ వర్సిటీ అర్హత పరీక్ష వాయిదా
Sakshi Education
హైదరాబాద్: ఏప్రిల్ 28న జరగాల్సిన అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అర్హత పరీక్ష-2019ను జూన్ 2వ తేదీకి వాయిదా వేసినట్లు వర్సిటీ అధికారులు ఏప్రిల్ 26న ఒక ప్రకటనలో తెలిపారు.
జూన్ 2న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును మే 18 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని లేదా 040-23680240 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Published date : 27 Apr 2019 03:17PM